Site icon HashtagU Telugu

Cyberabad: డ్రగ్ ను స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు

Drugs Imresizer

Drugs Imresizer

Cyberabad: సైబరాబాద్ ఎస్‌ఓటీ మాదాపూర్ టీం, కూకట్‌పల్లి పోలీస్ లు కూకట్‌పల్లి స్టేషన్ పరిధిలో ని శేషాద్రినగర్ లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుండి 3 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నారు. బెంగళూరు లో పనిచేస్తున్న వీరి మిత్రుడైన ప్రేమ్ సాయి అనే యువకుడు వీరికి సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది కూకట్ పల్లి పోలీసులు విచారిస్తున్నారు.

మరొకేసులో సైబరాబాద్ ఎస్‌ఓటీ మాదాపూర్ టీం, జగత్‌గిరిగుట్ట పోలీస్ లు బాలకృష్ణ హైస్కూల్, తులసినగర్ వద్ద 2 విద్యార్థులను పట్టుకుని 3 గ్రాముల MDMA డ్రగ్, చిన్న ప్యాకెట్లలో ఉన్న 45 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రోహిత్ అనే విజయవాడ కు చెందిన యువకుడు (ఇంతకుముందు బెంగుళూరు విమానాశ్రయంలో పనిచేశారు) హైదరాబాద్ వచ్చి డ్రగ్ డెలివరీ చేశాడు అని తెలుస్తుంది.