ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించిన రష్యా ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని మెయిన్ సిటీస్‌ను రష్యా టార్గెట్ చేసింది. ఇక గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ను మూడు వైపులా నుంచి చుట్టుముట్టి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక మరోవైపు ఉక్రెయిన్ పై పరోక్షంగా సైబర్ దాడులు కూడా జరుగుతున్నాయని సమచారం.
ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టిన కొద్దిసేపటికే, ఆ దేశంలోని పార్లమెంట్, పలు ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లపై సైబర్ దాడులు జరిగాయి.ఈ క్రమంలో కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్, విదేశాంగ వ్యవహారాల శాఖ, మౌలిక వసతుల శాఖ, విద్యాశాఖ తదితర ప్రభుత్వ వెబ్ సైట్ల పై కొందరు గుర్తు తెలియని దుండగులు సైబర్ దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడి సేవలు నిలిచిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. విధ్వంసకర మాల్వేర్ను వందలాది కంప్యూటర్లలోకి చొప్పించారని వెల్లడించారు. లాత్వియా, లిథువేనియా దేశాల్లోని కంప్యూటర్లలోనూ వైరస్ దాడులు జరిగాయని చెప్పారు. ఓవైపు సైనిక చర్యకు పాల్పడుతున్న రష్యానే, సైబర్ దాడులు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
