Site icon HashtagU Telugu

New CP: 30 మంది ఐపీఎస్ ల బదిలీ, హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

CV Anand

CV Anand

తెలంగాణ రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. వీరిలో కొందరికి స్థానచలనం అవ్వగా మరికొంతమంది వెయిటింగ్ లో ఉన్న అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చారు.

కొంతమంది కీలక అధికారులకు కూడా బదిలీ తప్పలేదు. బదిలీ అయిన వారికి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. వారిలో ఏసీబీ డీజీగా అంజనీ కుమార్‌,
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌
ఏసీబీ డైరెక్టర్‌గా షికాగోయల్‌,
క్రైమ్‌ సిట్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఏఆర్‌ శ్రీనివాస్‌,
హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌,
నల్లగొండ ఎస్పీగా రమారాజేశ్వరి,
సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా శ్వేత,
వెస్ట్‌జోన్‌ డీసీపీగా జోయల్‌ డేవిస్ నియమాకం అయ్యారు.

రోహిణీ ప్రియదర్శని మెదక్‌ ఎస్పీగా,
కామేశ్వర్‌ సింగనివార్‌ సైబరాబాద్‌ డిప్యూటీ కమిషనర్ గా, చందనా దీప్తి నార్త్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్ గా, ‌శరత్‌ చంద్ర పవార్‌ మహబూబాబాద్‌ ఎస్పీగా,
హైద‌రాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఎన్ ప్ర‌కాశ్‌రెడ్డి, వికారాబాద్‌ ఎస్పీగా కోటిరెడ్డి, నాగ‌ర్‌క‌ర్నూల్ ఎస్పీగా మ‌నోహ‌ర్, ‌ఆదిలాబాద్ ఎస్పీగా ఉద‌య్‌కుమార్‌,నిర్మ‌ల్ ఎస్పీగా ప్ర‌వీణ్‌, బాలాన‌గ‌ర్ డీసీపీగా గోనె సందీప్,‌ జ‌న‌గామ డీసీపీగా పి. సీతారాం, మాదాపూర్ డీసీపీగా శిల్ప‌వ‌ల్లి, నారాయ‌ణ‌పేట్ ఎస్పీగా ఎన్ వెంక‌టేశ్వ‌ర్లు, భూపాల‌ప‌ల్లి ఎస్పీగా సురేంద‌ర్‌రెడ్డి, కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్‌రెడ్డి,
శంషాబాద్ డీసీపీగా ఆర్ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి,
ఆసీఫాబాద్ ఎస్పీగా సురేష్
నిజామాబాద్ సీపీగా కేఆర్ నాగ‌రాజు నియామకమయ్యారు.