Site icon HashtagU Telugu

Hyderabad: రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో 15 లక్షలు విలువ చేసే బంగారం సీజ్

Hyderabad

Logo (7)

Hyderabad: హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోభారీగా బంగారం పట్టుబడింది. ఈ రోజు శుక్రవారం కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తనిఖీల్లో రూ.15.76 లక్షల విలువైన 259 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని క్రీమ్ బాక్సుల్లో దాచి ఉంచినట్లు తెలిపారు. కువైట్ నుండి వస్తున్న ప్రయాణికుడి నుండి చెక్-ఇన్ లగేజీలో క్రీమ్ బాక్స్‌లలో దాచిపెట్టిన రూ. 15.76 లక్షల విలువైన 259 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ తెలిపింది. ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నెల రోజుల క్రితం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా రూ.24.92 లక్షల విలువైన 412 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఆగస్టు 12న నాలుగు వేర్వేరు కేసుల్లో స్మగ్లింగ్ రాకెట్‌ను విఫలం చేసి, నలుగురు ప్రయాణికులను అరెస్టు చేసి రూ.4.86 కోట్ల విలువైన ఎనిమిది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మొదటి కేసులో బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి ప్యాంటులో దాచి ఉంచిన రూ.1,21,34,000 కోట్ల విలువైన 2 కేజీల బంగారు కడ్డీలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.రెండవ కేసులో బ్యాంకాక్ నుండి వచ్చిన ఒక ప్రయాణీకుడి దుస్తులలో 1.78 కిలోల గోల్డ్ కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1,08,81,165. మూడో కేసులో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.1,31,77,524 కోట్ల విలువైన పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాల్గవ కేసులో దుబాయ్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడి లోదుస్తులలో దాచిపెట్టిన 2.05 కిలోల బంగారం 1,24,31,283 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. మొత్తం 8 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని, కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు గత నెలలో తెలిపారు.

Also Read: Vijayawada : విజయవాడలో వివిధ కళాశాలల్లో పోలీసుల జులుం.. బ‌ల‌వంతంగా సెల‌వులు ప్ర‌క‌టించిన యాజ‌మాన్యం