Zomato Order: నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే.. యువత న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. 12 గంటల తర్వాత రోడ్లపై తిరుగుతూ.. కనిపించిన వారికల్లా విషెస్ చెప్తూ సందడి చేశారు. ఇక న్యూ ఇయర్ పార్టీల గురించైతే చెప్పనక్కర్లేదు. ఎక్కడికక్కడ నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్లలో మందేసి చిందేశారు. ఒక్కరోజే ప్రభుత్వానికి ఆల్కహాల్ ద్వారా వందలకోట్ల ఆదాయం సమకూరింది. ఇక వేల కిలోల చికెన్, మటన్ లను లాగించేశారు. ఆన్ లైన్లో బిర్యానీలకే ఎక్కుడ డిమాండ్ ఏర్పడింది.
నచ్చిన ఫుడ్ ను ఆన్ లైన్లో ఆర్డర్ చేసి తిన్నారు. అయితే.. కోల్ కతాలోని ఓ వ్యక్తి చేసిన పనికి ఏకంగా జొమాటో యజమానే ఆశ్చర్యపోయారు. 10, 20కాదు.. ఏకంగా 125 రుమాలీ రోటీలను ఆర్డర్ చేశాడు. దీనిపై సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ ఆర్డర్ చేసిన వ్యక్తి చేసుకుంటున్న పార్టీకి వెళ్లాలని ఉందని పేర్కొన్నారు. ఒక్కఆర్డర్ లోనే 125 రుమాలీరోటీలను ఆర్డర్ చేశారు.. నిజంగా అక్కడికి వెళ్లాలనిపిస్తోందని దీపిందర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.