CUET PG 2024: కామ‌న్ యూనివ‌ర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పూర్తి షెడ్యూల్ విడుద‌ల‌..!

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG 2024) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.

  • Written By:
  • Updated On - February 28, 2024 / 10:12 AM IST

CUET PG 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG 2024) పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. CUET-PG ప్రవేశ పరీక్ష మార్చి 11- మార్చి 28 మధ్య నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలకు ఫిబ్రవరి 26న NTA నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని విశ్వవిద్యాలయాలలో మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశానికి CUET PG ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కోర్సులకు CUET-UG పరీక్ష నిర్వహిస్తారు.

అధికారిక సమాచారం ప్రకారం.. NTA మార్చి 11- మార్చి 28 మధ్య CUET-PG 2024 పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా ఉంటాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోని 24 నగరాల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. దేశంలోని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని విద్యా మంత్రిత్వ శాఖ, యూజీసీ ఎన్‌టీఏను కోరాయి.

Also Read: Mali Bus Accident: ఘోర ప్రమాదం.. 31 మంది మృతి..!

ఎంత మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు?

ఈ పరీక్ష మొత్తం 44 షిఫ్టుల్లో జరుగుతుంది. ప్రతి షిఫ్ట్ పరీక్ష 105 నిమిషాలు ఉంటుంది. మొత్తం 157 సబ్జెక్టుల పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా 4 కోర్సులకు హాజరుకావచ్చు.

ఏదైనా సమస్య ఉంటే.. మీరు NTA హెల్ప్ డెస్క్‌కి 011 4075 9000 లేదా ఇమెయిల్ cuet-pg@nta.ac.inకి కాల్ చేయవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత https://nta.ac.in, https://pgcuet.samarth.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను పరీక్ష రోజుకు 7 రోజుల ముందు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

We’re now on WhatsApp : Click to Join