CSK vs KKR: తిప్పేసిన జడేజా… చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బాట

ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జోరుకు బ్రేక్ వేస్తూ 7 వికెట్ల తేడాతో మూడో విజయాన్ని అందుకుంది. బౌలింగ్ లో రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్ , తుషార్ పాండే స్పెల్ చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాయి.

CSK vs KKR: ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జోరుకు బ్రేక్ వేస్తూ 7 వికెట్ల తేడాతో మూడో విజయాన్ని అందుకుంది. బౌలింగ్ లో రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్ , తుషార్ పాండే స్పెల్ చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాయి.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు తొలి బంతికే బిగ్ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఫిల్ సాల్ట్ డకౌట్ అయ్యాడు. తర్వాత రఘువంశీ‌తో మరో ఓపెనర్ సునీల్ నరైన్ ధాటిగా ఆడాడు. తనదైన శైలిలో భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. దాంతో కేకేఆర్ పవర్ ప్లేలో 56 పరుగులు చేసింది. అయితే స్పిన్నర్ రవీంద్ర జడేజా ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. జడ్డూ వరుస వికెట్లు పడగొట్టి కోల్ కత్తా జోరుకు బ్రేక్ వేశాడు. రఘువంశీ, సునీల్ నరైన్ లని ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బ తీసాడు. తన తర్వాతి ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్ ను ఔట్ చేసిన జడేజా కోల్ కత్తాను తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేలా చేశాడు. చివరిలో రస్సెల్‌ కూడా త్వరగానే ఔట్ అవ్వడంతో కేకేఆర్ 20 ఓవర్లలో9 వికెట్లకు 137 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా 3, తుషార్ దేశ్‌పాండే 3 వికెట్లు పడగొట్టారు.

138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై త్వరగానే రచిన్‌ రవీంద్ర వికెట్ కోల్పోయింది. అయితే మిచెల్ , రుతురాజ్ గైక్వాడ్ ధాటిగా ఆడారు. పవర్ ప్లేలో చెన్నై 52 పరుగులు చేయగా…కోల్ కత్తా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. ఈ క్రమంలో రుతురాజ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్ కి 70 పరుగులు జోడించారు. మిచెల్ 25 రన్స్ కు ఔట్ అయినా రుతురాజ్, శివమ్ దూబె చెన్నైని విజయానికి చేరువ చేశారు. చివర్లో దూబే ఔట్ అయ్యాక ధోనీ ,రుతురాజ్ చెన్నై విజయాన్ని పూర్తి చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. రుతురాజ్ గైక్వాడ్ 67 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ఇది తొలి ఓటమి కాగా చెన్నై సూపర్ కింగ్స్ కు మూడో విజయం.

Also Read: AP News: ఏపీ ప్రజలు అలర్ట్.. రేపు ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు