Site icon HashtagU Telugu

DC vs CSK: చెన్నై భారీ టార్గెట్ (223).. అదరగొట్టిన ఓపెనర్స్

DC vs CSK

New Web Story Copy 2023 05 20t180605.826

DC vs CSK: ఐపీఎల్ 2023లో ఈ రోజు శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ కీలక మ్యాచ్ కి వేదికైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించగా.. చెన్నై ఈ రోజు మ్యాచ్ లో గెలిస్తే సునాయాసంగా ప్లే ఆప్స్ కి వెళుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్ చెన్నై బ్యాటింగ్‌కు ఓపెనర్లు వచ్చారు. చెన్నై తరుపున బ్యాటింగ్ ప్రారంభించిన డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్ పరుగుల వర్షం పారించారు. ఈ ఇన్నింగ్స్ లో వీరిద్దరూ చెరో అర్ధ సెంచరీలు నమోదు చేశారు. 13 ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 130 పరుగులు చేసింది.15వ ఓవర్‌లో చేతన్ సకారియా ఓవర్ మూడో బంతికి రితురాజ్ గైక్వాడ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. గైక్వాడ్ 50 బంతుల్లో 79 పరుగులు చేసి గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 223/3 పరుగులు చేసింది.

చెన్నై ఆటగాళ్లలో రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 70 పరుగులలో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో అదరగొట్టాడు. డెవాన్ కాన్వే 52 బంతుల్లో 87 పరుగులతో చెలరేగాడు. డెవాన్ కాన్వే ఈ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. శివమ్ దూబే 9 బంతుల్లో 22 పరుగులు, ధోని 4 బంతుల్లో 5 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. జడేజా 7 బంతుల్లో 20 పరుగులు చేసి 3 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు.

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), యశ్ ధుల్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలే రస్సో, అమన్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్కీ

చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహిష్ తీక్షణ

Read More: Malavika Mohanan &Prabhas: ప్రభాస్ కటౌట్, చరిష్మాటిక్.. కేరళ బ్యూటీ ఇంట్రస్టింగ్ కామెంట్స్