Site icon HashtagU Telugu

Dhoni: దటీజ్ ధోనీ

Ms Dhoni

Ms Dhoni

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నైసూపర్ కింగ్స్ కు పేరుంది. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై ఫ్రాంచైజీ ఏకంగా 4 టైటిల్స్ సాధించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ టీమ్ పనయిపోయింది అన్న వాళ్లకు అదిరిపోయే విజయాలతోనే జవాబు చెప్పింది. ఇదంతా ఎంఎస్ ధోని కెప్టెన్సీ వల్లే సాధ్యమైందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. జట్టును లీడ్ చేయడంలో మహీ స్టైలే వేరు. తాజాగా వ్యూహ రచనలో తన స్పెషాలిటీ మరోసారి నిరూపంచుకున్నాడు.
మార్చి 26 నుంచి ఐపీఎల్‌ 2022 సీజన్ కోసం బీసీసీఐ వేదికలను ఖరారు చేసింది.

కోవిడ్ ఆంక్షలు కారణంగా ఈసారి ఐపీఎల్ మ్యాచులన్నీ మహారాష్ట్రలోనే జరుగనున్నాయి. ముంబయిలో 55, పుణెలో 15 మ్యాచ్ లు నిర్వహిస్తారు. వీటిలో వాంఖడే 20, బ్రబోర్న్ 20, డీవై పాటిల్ స్టేడియం 15, ఎమ్ సి ఏ గ్రౌండ్ 15 మ్యాచ్ లు జరగనున్నాయి.

అయితే ముంబై ఇండియన్స్‌ జట్టుకు అన్ని మ్యాచ్‌లు సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలోనే ఆడటం కలిసి వస్తుందనే అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో చెన్నై సారథి ఎంఎస్ ధోని మాస్టర్ ప్లాన్ వేశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌ ప్రారంభానికి ముందు చెన్నై జట్టు మూడు వారాల పాటు ప్రాక్టీసు చేయనుంది. నిజానికి ప్రతీ సీజన్ ముందు చెన్నైలోనే ధోని సేన ప్రాక్టీస్ చేస్తుంది. అయితే, ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో జరుగనున్నాయి కాబట్టి సూరత్‌లో ఈసారి ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించాలని ధోనీ నిర్ణయించినట్లు సమాచారం.ఎందుకంటే సూరత్‌లోని పిచ్‌లు అచ్చంగా మహారాష్ట్ర పిచ్‌ల మాదిరిగానే ఉంటాయట. ఈ క్రమంలోనే ధోని, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ శిక్షణా శిబిరాన్ని సూరత్‌కు తరలించాలని నిర్ణయం తీసుకున్నాడు.