Site icon HashtagU Telugu

Conway Wedding: చెన్నైకి మరో కోలుకోలేని షాక్

Devon Conway

Devon Conway

Devon conway ప్రస్తుత ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములతో ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఓ వైపు వరుస పరాజయాలు మరో వైపు గాయాల సమస్యతో సతమతవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొలుత మెగావేలంలో 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ సీజన్‌ మొత్తానికి దూరమవగా, ఆ తరువాత న్యూజిలాండ్‌ పేసర్ ఆడమ్ మిల్నే కూడా మోకాలి గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూమయ్యాడు.

అయితే వీరిద్దరే అనుకుంటే తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. దక్షిణాఫ్రికాలో జరుగనున్న తన పెళ్లి కోసం ఆ జట్టు ఓపెనర్ న్యూజిలాండ్‌ ఆటగాడు డెవాన్‌ కాన్వే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లతో కలిసి ప్రీ వెడ్డింగ్‌ పార్టీ చేసుకున్న డెవాన్‌ కాన్వే పెళ్లి కోసం బయో బబుల్ నుంచి వైదొలిగాడు. అయితే కాన్వే తన వివాహం జరిగిన తర్వాత భార్యతో కలిసి తిరిగి భారత్‌కు వస్తాడని తెలుస్తోంది.ఇక డెవాన్ కాన్వే తన ప్రేయసి కిమ్ వాట్సన్ 2020లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు వారు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీంతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో చివరి నిలిచింది.

Exit mobile version