Site icon HashtagU Telugu

CSK:చెన్నై సూపర్ కింగ్స్ పై ఫాన్స్ ఫైర్

Csk

Csk

ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి పంజాబ్‌ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణ ఓటమి చవిచూసింది.. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ 15వ సీజన్‌లో హ్యాట్రిక్‌ ఓటములతో చెత్త రికార్డును నమోదు చేసింది.అయితే ఈ మెగా టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు.. కేకేఆర్ , లక్నో, పంజాబ్‌ లాంటి చిన్న జట్లతోనూ ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ బహిరంగంగానే తాము అభిమానించే జట్టు ఆటతీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు..

ఈ నేపథ్యం లోనే సన్ రైజర్స్ హైదరాబాద్‌ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్‌.. ఈ శనివారం మధ్యాహ్నం 3. గంటలకు డీవై పాటిల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే పోటీపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా రవీంద్ర జడేజా సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సన్ రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిపోతుందని, దింతో పాయింట్ల పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్‌ కూడా చెన్నై కంటే ముందుకెళ్తుందని విమర్శిస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మూడు వరుస ఓటములతో పాటు మరో చెత్త రికార్డును చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నమోదు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో రెండో అతి పెద్ద ఓటమిని అంటే 54 పరుగుల తేడాతో చవిచూసింది. అంతకుముందు ఐపీఎల్ 2013 సీజన్ లో ముంబై ఇండియన్స్‌ చేతిలో 60 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ 9 ఏళ్ల తర్వాత అలాంటి ఓటమిని ఖాతాలో వేసుకుంది.