Site icon HashtagU Telugu

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాన్ కు తీవ్ర గాయాలు

Chhattisgarh (1)

Chhattisgarh (1)

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలు విధ్వంసానికి దారి తీశాయి. ఐదు రాష్ట్రాలకు జరుపనున్న ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్నికలు నిర్వహించారు. తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కాగానే మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డాడు. నక్సల్ ప్రభావిత సుక్మా జిల్లాలో ఈ దాడులు జరిగాయి . సీఆర్పీఎఫ్ జవాన్ విధుల్లో భాగంగా తొండమార్క నుంచి ఎల్మగుండ గ్రామానికి వెళ్తుండగా నక్సల్స్ అమర్చిన ఐఈడీపై జవాన్ కాలు మోపాడు. ఈ పేలుడులో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జవాన్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని జిల్లా పోలీసు అధికారి కిరణ్ చవాన్ తెలిపారు. ఆ జవాన్‌ను శ్రీకాంత్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం నక్సల్స్‌ అమర్చిన ఐఈడీ పేలుడులో రెండు పెట్రోలింగ్‌ బృందాల్లోని బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ కూడా గాయపడ్డాడు.

ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా, పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు 600 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నవంబర్ 17న 90 స్థానాల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: TS Polls 2023 : జగిత్యాల అసెంబ్లీ బరిలో 82 ఏళ్ల వృద్ధురాలు పోటీ

Exit mobile version