హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షంలో ఓపెన్ డ్రైన్ నుంచి మొసలి పిల్ల బయటపడింది. నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీలోని డ్రెయిన్ నుంచి మొసలి పిల్ల బయటకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కుండపోతగా కురుస్తున్నవర్షంలో డ్రెయిన్ నుంచి ఒక్కసారిగా మొసలి పిల్ల బయటకు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. అటవీ శాఖాధికారులను అప్రమత్తం చేశారు. డ్రెయిన్‌పై వంతెన నిర్మిస్తున్న స్థలంలో సరీసృపాలు కనిపించాయి. వరద నీటిలో ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే మొసలిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. నాలుగు గంటలపాటు శ్రమించిన అటవీశాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు, పోలీసుల సాయంతో మొసలిని పట్టుకున్నారు. అనంతరం మొసలిని నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించారు.
Hyderabad : హైదరాబాద్‌లోని ఓపెన్ డ్రెయిన్‌లో బయటపడ్డ మొసలి ..భయాందోళనలో స్థానికులు

Crocodile