LS Polls: ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారిపై క్రిమినల్ చర్యలు

  • Written By:
  • Updated On - April 22, 2024 / 09:56 PM IST

LS Polls:  పార్లమెంట్ ఎన్నికల విధులు కోసం నియమించబడిన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మంది పై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కొరడా ఝులిపించారు.  శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన సిబ్బందిపై  ఆర్ పి యాక్ట్  1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

కాగా లోక్ సభ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఏవైనా ఉల్లంఘనలు కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావడానికి వీలుగా కొన్ని నియోజకవర్గాల్లో పరిశీలకుల ఫోన్ నంబర్లను అధికారులు ఇచ్చారు.  నల్లగొండకు వచ్చిన ఐఆర్ ఎస్ అధికారి కల్యాణ్ కుమార్ దాస్ పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేయనున్నారు.

అతని ఫోన్ నంబర్ 8121446758. నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గానికి ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసర్ సౌరభ్ ను 801983210 సంప్రదించవచ్చు. ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి వ్యయ పరిశీలకుడిగా జుడావర్ వివేకానంద్ ను నియమించారు. అదేవిధంగా ఉమాకాంత్ ద్రుపాటిని మహబూబాబాద్ కు నియమించారు. టోల్ ఫ్రీ నంబర్ 1950లోని సీ-విజిల్ యాప్ లో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదు చేయవచ్చు.