Site icon HashtagU Telugu

Thaggedhe Le: జడేజా తగ్గెేదే లే…

Ravindra

Ravindra

అల్లు అర్జున్ పుష్ప మూవీ మేనియా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. సాధారణ అభిమాని నుండి సెలబ్రిటీల వరకూ పుష్ప ఫీవర్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్ లో పలువురు స్టార్ ప్లేయర్స్ పుష్ప మేనరిజమ్స్ తో అభిమానులను అలరిస్తున్నారు.

మొన్నటి వరకూ సోషల్ మీడియాలో పుష్ప శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన భారత ఆటగాళ్ళు ఇప్పుడు పుష్ప ఫేమస్ డైలాగ్ తగ్గేదే లే అంటూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా శ్రీలంకతో లక్నో వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పుష్ప సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. లంక ఇన్నింగ్స్ 10 ఓవర్ రెండో బంతికి జడేజా దినేశ్ చందిమాల్ ను ఔట్ చేశాడు. వికెట్ తీసిన తర్వాత తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనిరిజమ్ ను ఇమిటేట్ చేశాడు. దీంతో స్టేడియంలో అభిమానుల మోతతో హోరెత్తిపోయింది. ఇప్పటికే లంక ప్రీమియర్ లీగ్ , బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీల్లో పలువురు ఆటగాళ్ళు పుష్ప మేనరిజమ్ సెలబ్రేషన్స్ తో ఆకట్టుకోగా… ఇప్పుడు భారత క్రికెటర్లు కూడా పుష్ప మేనియా జాబితాలో చేరారు. ప్రస్తుతం జడేజా తగ్గేదే లే అంటూ చేసిన మేనరిజమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version