Site icon HashtagU Telugu

Rajeshwari Gayakwad: సూపర్ మార్కెట్లో సిబ్బందితో గొడవపడిన మహిళా క్రికెటర్.. వీడియో వైరల్?

Rajeshwari Gayakwad

Rajeshwari Gayakwad

తాజాగా భారత మహిళా క్రికెటర్ ఒక వివాదంలో చిక్కుకుంది. ఒక సూపర్ మార్కెట్ లో ఆమె సిబ్బందితో గొడవ పడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత మహిళా క్రికెట్ టీమ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ తాజాగా వివాదంలో ఇరుక్కుంది. కర్ణాటకకు చెందిన రాజేశ్వరి గైక్వాడ్, ప్రస్తుతం విజయపుర ఏరియాలో నివసిస్తోంది. అయితే అదే ఏరియాలో ఉన్న ఒక సూపర్ మార్కెట్‌ కీ వెళ్లిన రాజేశ్వరి గైక్వాడ్‌కి అక్కడి సిబ్బంది తో ఏదో విషయమై గొడవ జరిగింది. దీంతో రాజేశ్వరి సదరు సిబ్బందితో గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ తరువాత మళ్ళీ కొద్దిసేపటి మరికొంత మంది మనుషులతో తీసుకొని ఆ సూపర్ మార్కెట్‌ సిబ్బంది పై దాడి చేసింది. అయితే సూపర్ మార్కెట్లోని సీసీ కెమెరాలో నమోదైన ఈ సంఘటన ఆధారంగా మహిళా క్రికెటర్ పై కేసు నమోదు చేయాలని పోలీసులు భావించారు. కానీ పరిస్థితి పోలీస్ స్టేషన్ వాళ్లకు వెళ్లకుండా ఇరువర్గాలు సమస్యని పరిష్కరించుకున్నారు. ధర్మ స్వల్పంగా గాయపడిన మార్కెట్ సిబ్బందికి రాజేశ్వరి క్షమాపణలు తెలిపింది. దీంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది.

అయితే సదరు మార్కెట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీసులకు షేర్ చేసిన సీసీటీవీ వీడియో ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలు మార్కెట్ సిబ్బందిపై దాడి చేయడానికి ఎంతమంది వచ్చారు ఎవరెవరు వచ్చారు అన్నది కనిపించకపోవడంతో అందుకు సంబంధించిన సీన్స్ ని డిలీట్ చేశారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version