Site icon HashtagU Telugu

Pakistan Cricketer: పాకిస్తాన్ లో దారుణ పరిస్థితులపై మాజీ క్రికెటర్ ఆవేదన..!!

Pakistan

Pakistan

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. నిత్యావసర ధరలు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంకుల్లో పెట్రోలు లేక, ఏటీఎంలలో డబ్బులు లేక అక్కడి ప్రజలు అవస్తలు పడుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు , ప్రత్యారోపణలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా దేశంలో నెలకొన్న దారుణ పరిస్థితులను వివరిస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెట్ మహమ్మద్ హఫీజ్ ఆవేదన చెందారు.

దేశంలోని దారుణ పరిస్థితులపై ట్వీట్ చేస్తూ రాజకీయ నేతలను ప్రశ్నించారు మహమ్మద్ హఫీజ్. లాహోర్ లోని బంకుల్లో పెట్రోలు లేదని..ఏటీఎంలలో నగదు అందుబాటులో లేదని పేర్కొన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతల నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలని ఆయన ప్రశ్నించారు. తన ట్వీట్ కు ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోపాటు పలువురు రాజకీయ నేతలను ట్యాగ్ చేశాడు హపీజ్.