Site icon HashtagU Telugu

Bomb Threat: బాంబ్ బ్లాస్ట్ తో పాక్ లో నిలిచిపోయిన క్రికెట్ మ్యాచ్

Whatsapp Image 2023 02 05 At 19.39.51

Whatsapp Image 2023 02 05 At 19.39.51

Bomb Threat: బాంబు పేళుళ్లతో పాకిస్థాన్ లో ఎంత కామన్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐదు రోజుల కిందట పెషావర్ లోని మసీదులో తాలిబన్ సూసైడ్ బాంబర్ జరిపిన దాడిలో.. 100 మందికి పైగా చనిపోయారు. ఈ ఘటన మరువక ముందే మరోసారి ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. ఈ సారి క్వెట్టా నగరంలోని మూసా చౌక్‌లో బాంబు పేలింది. దీంతో నిర్వాహకులు ఆటను మధ్యలోనే ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుత నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే బాంబు పేలుడు కారణంగా ఆటగాళ్లకు ఎలాంటి హాని జరగలేదు. పాకిస్థాన్ సూపర్ లీగ్ చరిత్రలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. క్వెట్టాలోని బుగట్టి స్టేడియంలో సర్ఫరాజ్ అహ్మద్‌కు చెందిన క్వెట్టా గ్లాడియేటర్స్, బాబర్ ఆజం పెషావర్ జల్మీ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇదే సమయంలో అప్పుడు అకస్మాత్తుగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో మ్యాచ్‌ను నిలిపేయాల్సి వచ్చింది.
మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో కొందరు దుండగులు బాంబు పేలుడు తర్వాత మైదానంలోకి రాళ్లు విసిరారు. అలాగే స్టేడియం బయట నిప్పు కూడా అంటించారు. దీంతో మధ్యలోనే మ్యాచ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుత వైరల్ అవుతున్నాయి. అయితే బాంబు పేలుడు కారణంగా ఆటగాళ్లకు ఎలాంటి హాని జరగలేదు. ఈ మ్యాచ్ కోసం 13000 వరకూ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ మ్యాచ్‌ని చూసేందుకు షాహిద్ అఫ్రిది, మొయిన్ ఖాన్, జావేద్ మియాందాద్ తదితర ప్రముఖులు కూడా వచ్చారు. అయితే పేలుడు కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయలేదని, గ్రౌండ్ లోకి కొందరు వ్యక్తులు బయటి నుంచి రాళ్లు విసరడంతో మధ్యలోనే మ్యాచ్ ను ఆపేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.