Kerala: కేరళలో దారుణం జరిగింది. ఎమ్మెల్యే కారుకు అడ్డు వచ్చిన ఓ కుటుంబంపై అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గర్భిణికి గాయాలయ్యాయి. ఆమె భర్తపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అయితే ఈ ఘటనపై స్పందించిన సదరు ఎమ్మెల్యే అసలేం జరగనట్టే తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
తిరువనంతపురంలోని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే స్టీఫెన్ . రిసెప్షన్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న మహిళలపై స్టీఫెన్‌కు సన్నిహితులు వేధింపులకు పాల్పడ్డారు. ఎనిమిది నెలల గర్భిణిపై కూడా దాడి జరిగింది. గర్భిణి మీడియాతో మాట్లాడుతూ…నేను నా భర్త మరియు బంధువుతో కలిసి కారులో ఉన్నాను. మేము రిసెప్షన్ నుండి తిరిగి వస్తున్నాము. అకస్మాత్తుగా కొంతమంది మా కారును చుట్టుముట్టి మాపై దుర్భాషలాడారు. నన్ను, నా కుటుంబాన్ని వేధించారు. నేను గర్భవతిని అని చెప్పినా వినలేదని చెప్పింది. కానీ అతను నా మాట వినలేదు. మా కారును కూడా ధ్వంసం చేశారు అని ఆమె చెప్పింది. తన భర్తను కూడా కొట్టారని, ముక్కుకు, చేతులకు గాయాలయ్యాయని ఆమె తెలిపింది.
మమ్మల్ని ఎందుకు కొట్టారో మాకు తెలియదని భర్త చెప్పాడు. ముందుగా ఎమ్మెల్యే స్టీఫెన్ కారును వెళ్లనివ్వండి అంటూ మాతో గొడవ పడ్డారని బాధితుడు చెప్పాడు. దాడిలో మహిళ తాళి గొలుసు కూడా తెగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా గర్భిణిని, ఆమె కుటుంబాన్ని వేధించడాన్ని ఎమ్మెల్యే స్టీఫెన్ ఖండించారు. బయట ఏం జరిగిందో తెలియదని ఎమ్మెల్యే అన్నారు. రిసెప్షన్‌కి వెళ్లాను. దీన్ని ఎవరు చేశారో మాకు తెలియదని కొట్టిపారేశాడు.