Site icon HashtagU Telugu

CPI Narayana: ఏపీ గ‌వ‌ర్న‌ర్ పై నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్..!

5678

5678

ఏపీ గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ పై సీపీఐ నేత నారాయణ విమ‌ర్శ‌లు గుప్పించారు.రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకునే పిచ్చి నిర్ణ‌యాలు అన్నింటికీ గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబట్టే గవర్నర్ ఆ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని నారాయ‌ణ అన్నారు. జగన్ తాను రద్దు చేసిన నిర్ణయాలను మళ్లీ తానే అమలు చేస్తున్నారని, వాటిని గవర్నర్ ఎలా ఆమోదిస్తారని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు.

ఇక జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు తాను ఏపీ గవర్నర్ గా ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడినని నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టం వ‌చ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే ప్ర‌జ‌లే త‌గిన బుద్ది చెబుతార‌ని నారాయ‌ణ వార్నింగ్ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశంపార్టీకి 23 సీట్లు అయినా వ‌చ్చాయ‌ని, అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు 10 సీట్లు కూడా రావ‌ని నారాయ‌ణ జోస్యం చెప్పారు. మ‌రి నారాయ‌ణ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version