Site icon HashtagU Telugu

Andhra Pradesh: విద్యుత్ కొనుగోలులో అవినీతి – సీపీఐ

సోలార్ విద్యుత్ కొనుగోళ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సోలార్ పవర్ ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ రామకృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూనిట్ రూ.2.05గా ఉన్న సోలార్ విద్యుత్ ను రూ.2.45 చొప్పున కొనుగోలు చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. రామకృష్ణ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సెకీ (ఎస్ఈసీఐ) ద్వారా ఏపీకి విద్యుత్ సరఫరాకు అదానీ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, అదానీ గ్రూప్ సోలార్ పవర్ కార్పొరేషన్, ఏపీ ప్రభుత్వం, కేంద్రం సహా 10 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Exit mobile version