CP Kanti Rana : సీఎం జగన్‌పై దాడి.. సీపీ కాంతి రాణా కీలక వ్యాఖ్యలు

విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 'మేమంత సిద్ధం' బస్సుయాత్రలో శనివారం నాడు ఆయనపై రాళ్ల దాడిపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఐపిసి సెక్షన్ 307 (హత్య ప్రయత్నంలో శిక్ష) కింద కేసు నమోదు చేశారు.

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 07:37 PM IST

విజయవాడలోని అజిత్‌సింగ్‌ నగర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంత సిద్ధం’ బస్సుయాత్రలో శనివారం నాడు ఆయనపై రాళ్ల దాడిపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఐపిసి సెక్షన్ 307 (హత్య ప్రయత్నంలో శిక్ష) కింద కేసు నమోదు చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు ఆధారంగా.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిపై దాడికి పాల్పడి ఉంటారనే అనుమానంతో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.

<span style=”color: #ff0000;”><strong>We’re now on WhatsApp</strong></span>. <a href=”https://whatsapp.com/channel/0029Va94sppFy72LQLpLhB0t”><strong>Click to Join.</strong></a>

అయితే.. ఈ రాళ్లదాడిలో సీఎం జగన్‌కు ఎడమ కనుబొమ్మపై గాయమైంది. అయితే.. ఈ దాడిపై విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్‌ రెడ్డి భద్రతా దృష్ట్యా విద్యుత్ సరఫరాను ఆ ప్రాంతంలో నిలిపివేశామని పేర్కొన్నారు. సీఎం జగన్ బస్సు పైకి ఎక్కి మాట్లాడుతారనే వైర్లు కట్ చేశామని తెలిపిన సీపీ కాంతి రాణా.. నాయకుల ప్రచార సభల్లో ఇవన్నీ సర్వసాధారణమన్నారు.
సంఘటన చోటు చేసుకున్న అజిత్‌ సింగ్ నగర్ పీఎస్ పరిధిలో మూడు సెల్‌ఫోన్ టవర్ల నుంచి డేటాను సేకరించినట్లు.. ప్రమాద జరిగిన సమయంలో 20 వేల సెల్‌ఫోన్లు ఈ మూడు సెల్‌ ఫోన్‌ టవర్లలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

సీఎం జగన్‌ బస్సు యాత్ర వద్దకు వచ్చిన జనంతో అక్కడి 20 నుంచి 30 అడుగుల దూరం వరకు జనాలు ఉన్నారని, ఇంకోవైపు కరెంటు సరఫరా నిలిపివేయడంతో చీకటిగా ఉందని, ఇదే అదునుగా భావించి సీఎంపై దాడి చేశారన్నారు. అయితే.. ఈ కేసులో ఇప్పటికే మొత్తం 8 బృందాలను ఏర్పాటు చేసినట్లు.. రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

త్వరలోనే దాడి చేసిన వారిని పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అక్కడున్న సీసీ ఫుటేజీని బట్టి ఓ వ్యక్తి దాడి చేయడాన్ని గుర్తించామని వెల్లడించారు.

అయితే.. దాడి జరిగిన రోజు రాత్రి 8.04 నిమిషాలకు సీఎంపై ఆగంతకుడు రాయి విసిరాడని, ఆ రాయి సీఎం నిలబడిన ఎడమ వైపు నుంచి దూసుకొచ్చిందని సీపీ కాంతి రాణా తెలిపారు.

దాడి జరిగిన సమయంలో రాయి వచ్చి జగన్ ఎడమ కనుబొమ్మకి, వెల్లంపల్లి శ్రీనివాస్‌ ముక్కు, కంటికి తగిలి గాయమైందని ఆయన తెలిపారు. అందుకు సంబంధించి వీడియో ఫుటేజ్ అందుబాటులో ఉందని, ఆ ఫుటేజీని విశ్లేషించేందుకు FSLకి పంపిచామని తెలిపారు సీపీ క్రాంతి రాణా.

Read Also :Gold-Silver Panipuri : బంగారం-సిల్వర్‌తో పానీపూరీ.. టేస్ట్‌ అయితే.. యమ్మీ..!