Site icon HashtagU Telugu

Ramdev Baba: ఆవు మూత్రంతో క్యాన్సర్,హై బీపీ తగ్గుతాయి: రాందేవ్ వివాదస్పద వ్యాఖ్యలు

Ramdev Baba

Ramdev Baba

యోగా గురువు రాందేవ్ ఇటీవల తరుచుగా వివాదాల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఆయన మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి వైద్యంలో కేన్సర్, హైబీపీ, మధుమేహం వంటి వ్యాధులకు చికిత్స లేదని , గోమూత్రం, ఆయుర్వేద ఔషధాల కలయికతో కేన్సర్ వంటి వ్యాధులను తమ సంస్థలో పూర్తిగా నయం చేసినట్టు రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్‌ ఆయుర్వేద యూనివర్సిటీ, దీనదయాళ్‌ కామధేను గోశాల సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సులో ఆయన మాట్లాడారు. క్యాన్సర్, హై హైబీపీ, మధుమేహం వంటి వ్యాధులను ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చన్నారు.

ఆవు పాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, వాటితో చాలా వరకు రోగాలను నయం చేయవచ్చన్నారు. ఆవు మూత్రం కూడా అనేక రోగాలనునయం చేస్తుందని ఆయన చెప్పారు. ఆయర్వేదంలో మూలాల నుంచి ఆ రోగాలను నిర్మూలించవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం రాందేవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే రాందేవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పలు సంఘాలు ఆయన తీరుపై ఆందోళన వ్యక్తం చేయడంతో క్షమాపణలు కూడా చెప్పారు.