Plastic Covers: దారుణం.. ఆవు దూడను పొట్టన పెట్టుకున్న ప్లాస్టిక్?

ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో రోడ్డుపై ఎక్కడ చూసినా కూడా మనకు ప్లాస్టిక్ వస్తువులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగానే

  • Written By:
  • Publish Date - June 12, 2023 / 07:22 PM IST

ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో రోడ్డుపై ఎక్కడ చూసినా కూడా మనకు ప్లాస్టిక్ వస్తువులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలను తీసుకువచ్చినప్పటికీ ప్లాస్టిక్ వినియోగాన్ని మాత్రం ఆపడం లేదు. ఈ ప్లాస్టిక్ విషయంలో చాలామందికి సరైన అవగాహన లేక వాడకాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడొద్దు అని ఎంత చెప్పినా కూడా మనుషులు వినిపించుకోవడం లేదు.

ఈ ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోవడం వల్ల మనుషుల ప్రాణాలతో పాటు జంతువుల ప్రాణాలు కూడా అప్రమాదంలోకి పడుతున్నాయి. అయితే ఇప్పటికే చాలా మూగ జంతువులు ప్లాస్టిక్ కి తినడం వల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో ఇటువంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తాజాగా ప్లాస్టిక్ పైన భూతం ఒక ఆవును దాని కడుపున పుట్టాల్సిన దూడను బలిగొంది. ఈ దారుణమైన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల టౌన్ లో ఆవును, దాని కడుపులో ఉన్న దూడను ప్లాస్టిక్ భూతం కంభలించింది. నంద్యాల పట్టణంలో ఒక ఆవు ఎనిమిది నెలల గర్భంతో ఉంది.

అయితే గర్భవతి కావడంతో రోడ్లమీద తిరిగే ఆవు ఆహారం కోసం రోడ్డు మీద ఉన్న చెత్తచెదారం అన్ని తింటూ వచ్చింది. అలా మొత్తం తన కడుపులో ప్లాస్టిక్ నిండిపోవడంతో ప్రసవానికి ఇబ్బంది కరంగా మారింది. ప్రసవ వేదనను నొప్పిని భరించలేక రోడ్డు మీద నరకయాతనను అనుభవించింది. అది గమనించిన కొందరు స్థానికులు జంతు ప్రేమికులు దాన్ని సొంత ఖర్చులతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సిజేరియన్ చేసి దూడను బయటకు తీశారు. దూడతోపాటు ఆవు కడుపులో ఉన్న 60 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు, క్యారీ బ్యాగులు బయటకు తీశారు. అయితే కష్టపడి ఆ ఆవుకి సిజేరియన్ చేసినప్పటికీ అవును దూడను వైద్యులు కాపాడలేకపోయారు. గంటల వ్యవధిలోనే ఆవు దూడ మృతి చెందడంతో అది చూసి చలించి పోయిన జంతు ప్రేమికులు స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.