Site icon HashtagU Telugu

Delhi Capitals and Covid: ఢిల్లీ జట్టును వెంటాడుతున్న వైరస్

Delhi Capitals

Delhi Capitals

ఢిల్లీ క్యాపిటల్స్‌ , పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఇవాళ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనున్న మ్యాచ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ పుణేలో జరగాల్సి ఉంది. అయితే డీఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో కరోనామహమ్మారీ విజృంభించడంతో వేదిక ముంబైకి మారింది. అయితే ఈ మ్యాచ్ ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఆ జట్టులో ఐదుగురు కరోనా మహమ్మారి బారిన పడగా, తాజాగా మరో ఆటగాడు టీమ్ సీఫెర్ట్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీ జట్టు ఈరోజు రాత్రి 7:30 గంటలకు పంజాబ్‌ కింగ్స్‌తో ఆడుతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో తొలుత ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హార్ట్, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్, డాక్టర్‌ అభిజిత్‌ సాల్వి, మసాజ్‌ థెరపిస్ట్‌ చేతన్‌ కుమార్‌, సోషల్‌ మీడియా కంటెంట్‌ సభ్యుడు ఆకాశ్‌ మనేలకు కరోనా సోకగా… తాజాగా టీమ్ సీఫెర్ట్ కరోనాబారిన పడ్డాడు. టీమ్ సీఫెర్ట్ మంగళవారం ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొని మిగిలిన ఆటగాళ్లందరితో కలిసి తిరిగాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే మ్యాచ్‌ వేదికను పూణే నుంచి ముంబైకి మార్చిన బీసీసీఐ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్‌ షెడ్యూల్ ప్రకారమే మొదలయింది.ఇక ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, పంజాబ్‌ కింగ్స్‌ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 3 ఓటములతపో ఏడో స్థానంలో కొనసాగుతోంది.