Covid-19: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం మొదలైంది. ఇప్పటివరకు వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేగంగా పెరిగి వేలల్లోకి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,758 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 22 మంది మృతి చెందినట్లు అధికారిక సమాచారం. కేరళలో అత్యధికంగా 1,400 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 814, ఢిల్లీలో 436 కేసులు ఉన్నాయని తెలిపింది. అలాగే గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది. ఒడిశాలో 12 కేసులు నమోదవగా, పశ్చిమ బెంగాల్‌లో 287 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
అయితే, అధికంగా నమోదవుతున్న కేసులన్నీ తేలికపాటి లక్షణాలతోనే ఉన్నాయని, బాధితులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారని వైద్య అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు.
CM Revanth Reddy : తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం
కర్ణాటక లో అప్రమత్తమైన ప్రభుత్వం
జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మే 26న నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆరోగ్య శాఖ పాఠశాలలకు కీలక సూచనలు జారీ చేసింది.
పాఠశాలల కోసం సూచనలు
- పిల్లలకు జ్వరం, దగ్గు, జలుబు వంటి కోవిడ్ లక్షణాలు ఉంటే పాఠశాలకు పంపవద్దు
- పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవాలని సూచన
- లక్షణాలు పూర్తిగా తగ్గిన తర్వాతే పాఠశాలకు పంపించాలంటూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు