Site icon HashtagU Telugu

Covid: దేశంలో కొవిడ్ విజృంభణ.. 2 లక్షలు దాటేసిన కేసులు!

Covid Tests

Covid Tests

దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్టేనా..? కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తిస్తుందా..? అంటే అవుననే చెప్పక తప్పదు. చాపకింద నీరులా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అయితే బుధవారంతో పోలిస్తే 27 శాతం కోవిడ్‌ కేసులు అధికంగా పెరిగాయి. రోజురోజుకూ కేసుల తీవ్రత పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు బూస్టర్ డోసు చర్యలను వేగవంతం చేస్తున్నాయి. మాస్క, శానిటైజేషన్ లాంటి నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి.