COVID-19: ఫీవర్‌ ఆస్పత్రిలో కోవిడ్ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌రెడ్డి

తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.

Published By: HashtagU Telugu Desk
COVID-19

COVID-19

COVID-19: తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో కరోనా సంఖ్య 21కి చేరింది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 700కు చేరింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.

అలాగే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తిలక్‌నగర్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో కోవిడ్‌పై ఏర్పాట్లను పరిశీలించారు. కొవిడ్‌ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేశామని చెప్పారు. అవసరమైతే కోవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామన్నారు. శాస్త్రవేత్తలు మరియు వైద్యులు కొత్త వేరియంట్ యొక్క వ్యాప్తి వేగంగా మరియు ప్రమాదకరం కాదని చెప్తున్నారని అయితే కోవిడ్‌పై ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అయితే పరిస్థితి చూసి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.

Also Read: Sradda Das ” శ్రద్ద దాస్ స్కిన్ షో కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

  Last Updated: 25 Dec 2023, 12:19 PM IST