Delhi: ప్రైవేట్ పాఠశాల్లో క‌రోనా క‌ల‌క‌లం.. యజమాన్యాలు అలర్ట్

ఢిల్లీలోని ప్ర‌వేట్ పాఠ‌శాలల్లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తుంది. కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిందనుకుంటున్న స‌మ‌యంలో విద్యార్థుల‌పై క‌రోనా పంజా విసురుతుంది.

  • Written By:
  • Updated On - April 14, 2022 / 03:46 PM IST

ఢిల్లీలోని ప్ర‌వేట్ పాఠ‌శాలల్లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తుంది. కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిందనుకుంటున్న స‌మ‌యంలో విద్యార్థుల‌పై క‌రోనా పంజా విసురుతుంది. ఇప్ప‌టికే నోయిడాలోని ఓ పాఠ‌శాల‌లో క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా తాజ‌గా ఢిల్లీలోని ప్ర‌వేట్ స్కూల్ లో క‌రోనా అల‌జ‌డి సృష్టిస్తుంది. ఢిల్లీ ప్ర‌వేట్ స్కూల్ లో ఓ విద్యార్థికి, ఉపాధ్యాయుడికి క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అవ్వ‌డంతో స్కూల్ యాజ‌మాన్యం అలెర్ట్ అయింది. పాఠశాల విద్యార్థులంద‌రిని ఇంటికి తిరిగి పంపించారు. ముందు జాగ్రత్త చర్యగా వైరస్ ఇతరులకు సోకకుండా, మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి పాఠశాల యాజమాన్యం విద్యార్థులందరినీ సెలవుపై పంపింది.

వైద్య ఆరోగ్య శాఖ వివ‌రాల ప్ర‌కారం.. ఢిల్లీలో బుధవారం 299 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది రెండు రోజుల క్రితం నమోదైన రోజువారీ సంఖ్యతో పోలిస్తే కేసులు పెరిగాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. అయితే పాజిటివిటీ రేటు 2.49 శాతంగా ఉంది. ఢిల్లీలో కోవిడ్ పాజిటివిటీ రేటు ఒక వారంలో 0.5 శాతం నుండి 2.70 శాతానికి పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య ఇంకా తక్కువగా ఉన్నందున ఇది అంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు కాద‌ని వైద్యులు అంటున్నారు.ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం మాట్లాడుతూ రోజువారీ కేసుల పెరుగుదల గత కొన్ని రోజులుగా పాజిటివిటీ రేటు గణనీయంగా పెరగడంతో ప‌రిస్థితిపై నిఘా ఉంచామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కోవిడ్-19 సంఖ్య 18,66,881గా ఉండగా, మరణాల సంఖ్య 26,158గా ఉందని తాజా బులెటిన్ పేర్కొంది.