Site icon HashtagU Telugu

Covid-19: విద్యార్థులు ఇంటికి వెళ్లాలని హెచ్ సీ యు ఆదేశం

Hyderabad Universifty

Hyderabad Universifty

కోవిడ్ కేసులు పెరుగుతున్నందున క్యాంపస్ ను ఖాళీ చేసి వెళ్లాలని హైద్రాబాద్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహిస్తామని తెలిపింది. చివరి సెమిస్టర్ పరీక్షల వరకు అన్నీ ఆన్ లైన్ లొనే ఉంటాయని ప్రకటించింది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వసతులు లేవని చెప్పింది. ఐసోలాషన్ లో ఉంచడానికి అవసరమైన గదులు లేవని తేల్చింది. అందుకే ముందు జాగ్రత్త గా విద్యార్థులు ఇంటికి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది. ఒక్క రోజుల్లోనే 38 కేసులు నమోదు అయిన కారణంగా హాస్టల్ ఖాళీ చేయాలని సూచించింది.