Site icon HashtagU Telugu

Covid-19: జూలై నాటికి కోవిడ్ తీవ్రతరం!

Covid Tests

Covid Tests

మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణలలో ఓమిక్రాన్ BA4, BA5 వేరియంట్‌ కారణంగా కోవిడ్-19 కేసులు జూలైలో ఎప్పుడైనా గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు లెక్కకుమించి పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళలో సగటు రోజువారీ కేసులోడ్ 2,000 కంటే ఎక్కువగా ఉండగా, ఇతర దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రతిరోజూ 150 నుండి 500 వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. “ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. జూలైలో గరిష్ట స్థాయికి చేరుకోవాలి. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి ”అని ఐఐటి-కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ చెప్పారు.