Hyderabad: సినిమా ఫక్కీలో టెక్కీ కిడ్నప్.. ఛేదించిన పోలీసులు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కిడ్నప్ కేసులో మహిళతో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. 34 ఏళ్ల ఐటీ ఉద్యోగిని ఖాజాగూడలో జనవరి 4వ తేదీన కిడ్నాప్ గురైంది.

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కిడ్నప్ కేసులో మహిళతో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. 34 ఏళ్ల ఐటీ ఉద్యోగిని ఖాజాగూడలో జనవరి 4వ తేదీన కిడ్నాప్ గురైంది. అయితే ఈ కేసులో నిందితురాలు తన సొంత బంధువు కావడం విశేషం.

మహిళ తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. పైగా విలాసవంతమైన జీవితం కోసం తప్పుడు పనులు చేయాలనీ నిశ్చయించుకున్నారు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని, అందుకోసం తన టెక్కీ కజిన్‌ని కిడ్నాప్ చేయడానికి పన్నాగం వేసింది. ఈ కిడ్నప్ కు తన ప్రేమికుడు సహా మరికొందరితో మాట్లాడింది. ఈ కిడ్నప్ ముఠాలో ఓ నిందితుడిపై 23 దొంగతనాలు, దోపిడీలు మరియు కిడ్నాప్ కేసులు ఉన్నాయి.

కిడ్నాపర్ల ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్ ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో 48 గంటల్లో బాధితురాలిని రక్షించారు. ఆమెను విడిపించేందుకు మొదట రెండు కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు.. తమ వాహనం ట్రాక్ అవుతుందని తెలుసుకున్న తర్వాత రూ.20 లక్షలకు తగ్గించినట్లు పోలీసులు తెలిపారు.

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసేందుకు వారు కుట్ర పన్నారని, దాని ప్రకారం కొన్ని వ్యక్తిగత సమస్యలపై చర్చించేందుకు ఖాజాగూడ లేక్ రోడ్డు వద్ద తనను కలవాలని మహిళ తన బంధువును పిలిపించిందని పోలీసులు తెలిపారు.బాధితురాలు అక్కడికి వెళ్లగా ప్రధాన నిందితుడు అతని ముఠా సభ్యులతో కలిసి ఆమెను కారులో కిడ్నాప్ చేసి పథకం ప్రకారం పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేశారు. అయితే నిందితులు ఆత్మకూరు అటవీ చెక్‌పోస్టు బారికేడ్లను ఢీకొట్టి బాధితురాలితో సహా వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు బాధితురాలిని రక్షించారు.

విశ్వసనీయ సమాచారంపై రాయదుర్గం పోలీసులు జనవరి 6న ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు మరియు విచారణలో వారు నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: Chandrababu : నిరుద్యోగ భృతిపై చంద్రబాబు కీలక హామీ…