MLC Kavitha: జైలులో కవిత డిమాండ్స్ పై కోర్టు కీలక నిర్ణయం

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే జైలులో తనకు కొన్ని వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దాంతో.. స్పందించిన న్యాయస్థానం కూడా అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత విజ్ఞప్తి మేరకు సొంతంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం, రోజూవారీ ఉపయోగించే దుస్తులు తీసుకోవడం, కొన్ని ఆభరణాలు ధరించడంతో పాటు సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, […]

Published By: HashtagU Telugu Desk
Kavitha Court

Kavitha Court

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే జైలులో తనకు కొన్ని వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దాంతో.. స్పందించిన న్యాయస్థానం కూడా అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత విజ్ఞప్తి మేరకు సొంతంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం, రోజూవారీ ఉపయోగించే దుస్తులు తీసుకోవడం, కొన్ని ఆభరణాలు ధరించడంతో పాటు సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు వేసుకోవడం వంటి వెసులుబాట్లు కల్పించింది కోర్టు. తీహార్‌ జైలుకు తరలించకముందే కవితకు ప్రత్యేక కోర్టు ఈ వెసులుబాట్లు కల్పించించింది.

ఈ వసతులను తీహార్‌ జైలు అధికారులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాదులు ప్రత్యేక కోర్టుకు ఫిర్యాదు చేశారు. రోజువారీ ఉపయోగించే దుస్తులను కూడా అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా దీన్ని పరిశీలించారు. దాంతో.. స్పందించిన న్యాయస్థానం జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది.

  Last Updated: 29 Mar 2024, 11:27 AM IST