Excise Policy Case: జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్‌

సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బుధవారం కోర్టులో హాజరుపరచగా సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈడీ కేసులో ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే తరువాత ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది.

Excise Policy Case: సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బుధవారం కోర్టులో హాజరుపరచగా సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈడీ కేసులో ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే తరువాత ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది.

అంతకుముందు ఇరుపక్షాల న్యాయవాదులు తమ తమ వాదనలను వినిపించారు. విచారణ పూర్తయిన తర్వాత కోర్టు నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. కేజ్రీవాల్‌ను ట్రయల్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత అవినీతి ఆరోపణలపై సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. కోర్టు కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ రిమాండ్‌కు పంపింది. ఈ రోజు రిమాండ్ ముగిసింది..

కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులను కోర్టు గదిలో పది నిమిషాల పాటు కలుసుకునేందుకు కేజ్రీవాల్ తరపు న్యాయవాది అనుమతి కోరారు. కోర్టు గదిలోనే సమావేశానికి కోర్టు అనుమతించింది. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపే అంశంపై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

Also Read: CM Chandrababu : స్కిల్ సెన్సస్ కోసం డోర్-టు-డోర్ సర్వే