Site icon HashtagU Telugu

Court: బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్

Template (76) Copy

Template (76) Copy

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించింది. సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. సంజయ్ తో పాటు కొర్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్ కు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఆదివారం రాత్రి కరీంనగర్ లో జాగరణ పేరుతో బండి సంజయ్ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలను అతిక్రమించి దీక్ష చేపట్టరాదని పోలీసులు నోటీసులు జారీ చేశినప్పటికీ కూడా ఆయన దీక్ష చేపట్టారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు.