Site icon HashtagU Telugu

Owaisi: కర్ణాటక హైకోర్టు తీర్పుపై ఒవైసీ రియాక్షన్!

హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. మ‌తం, సంస్కృతి, వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణకు విఘాతం క‌లిచడంగా ఆయ‌న అభివర్ణించారు. తన కట్టుబాట్లను పాటిస్తూనే ముస్లింలకు చదువు చెప్పాలన్నది అల్లా ఆజ్ఞ అని అసదుద్దీన్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పుతో తాను విభేదిస్తున్నానని.. తీర్పుతో విభేదించడం త‌న‌ హక్కని.. దీనిపై పిటిషనర్లు సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తారని తాను ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. హిజాబ్ ధరించిన మహిళలపై వేధింపులను చట్టబద్ధం చేయడానికి కోర్టు తీర్పు ఉపయోగించబడదని కూడా అసద్ భావిస్తున్నారు.