Site icon HashtagU Telugu

Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం ఇదే..

Template (73) Copy

Template (73) Copy

డిసెంబరు 8న తమిళనాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో ‘కోర్టు ఆఫ్‌ ఎంక్వయిరీ’ నిర్వహించగా.. ఈ రోజు ఆ కమిటీ నివేదికను సమర్పించింది. హెలికాప్టర్‌ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘కోర్టు ఆఫ్‌ ఎంక్వయిరీ’లో నిర్ధారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఈ నివేదికను త్వరలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరికి సమర్పించనున్నారు. ప్రస్తుతం తుది నివేదికను వైమానిక దళం న్యాయవిభాగం పరిశీలిస్తోంది. నివేదికలోని అంశాలపై అటు ప్రభుత్వం గానీ.. ఇటు వైమానిక దళం గానీ.. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే గత నెల 8న తమిళనాడులోని కూనూర్‌కి సమీపంలో రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ అనుకోకుండా ప్రతికూల వాతావరణంలోకి వెళ్లి చిక్కుకుపోయిందని, అంతే తప్ప అందులో ఎలాంటి సాంకేతిక, యాంత్రిక తప్పిదాలు లేవని నివేదికలో పేర్కొంది.