Site icon HashtagU Telugu

మ్యాన్ హోల్ లో పడి పోయిన భార్య భర్తలు.. చివరికి అలా?

Screenshot 2022 06 20 203027

Screenshot 2022 06 20 203027

మన చుట్టూ ఉన్న సమాజంలో నిత్యం ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే అందులో కొన్ని ఆశ్చర్యకరంగాను, మరికొన్ని బాధాకరంగా, ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. ఇకపోతే మన చుట్టూ ఉన్న సమాజంలో నిత్యం కొన్ని పదుల సంఖ్యలో వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే అందులో భయంకరమైన ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ప్రమాదాలు జరిగిన సమయంలో కొంతమంది అదృష్టవశాత్తు ప్రాణాలు కొద్ది బయటపడగా, కొంతమంది మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటారు.

మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లేటప్పుడు మనకు రోడ్డుపై మ్యాన్హోల్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలిసినప్పటికి కొంత మంది అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల నిర్లక్ష్యంగా ప్రాణాలను కోల్పోతుంటారు. ఇప్పటికే ఎంతోమంది ఇలా మ్యాన్ హోల్ లో పడి ప్రాణాలను సైతం పోగొట్టుకున్న వారు ఉన్నారు. మరికొంతమంది అదృష్టవశాత్తు బయటపడిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకో పోయే భార్యాభర్తలు కూడా ఉన్నారు అని చెప్పవచ్చు.

తాజాగా ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తెరచి ఉన్న ఒక మ్యాన్హోల్లో పడి భార్యాభర్తలు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ లో ఒక పోలీసు తన భార్యతో కలిసి రోడ్డుపై చక్ర వాహనం లో వెళ్తున్నారు. భార్యతో కలసి ఆస్పత్రికి వెళ్తుండగా భారీ వర్షం పడుతుండడంతో బైక్ ను పక్కన ఆపేందుకు ప్రయత్నించారు. కానీ వర్షం లో భారీగా నీరు నిలిచి ఉండటం వల్ల ఆ మ్యాన్ హోల్ ను గుర్తించలేకపోయారు. దీంతో ఆ మ్యాన్ హాల్ లో భార్యాభర్తలిద్దరూ వాహనం తో పాటుగా పడిపోయారు. అది గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీశారు. ఇక చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇదంతా కూడా దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.