Site icon HashtagU Telugu

Aditya L1 Launch : ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగానికి కౌంట్ డౌన్.. ఈ శాటిలైట్ జర్నీ ఎన్ని రోజులో తెలుసా ?

Sun Mission Aditya L1

Isro Launching Aditya L1 Mission on September 2nd

Aditya L1 Launch :  సూర్యుడిపై రీసెర్చ్ కోసం ఇస్రో నిర్వహించనున్న ‘ఆదిత్య ఎల్ – 1’ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. సెప్టెంబరు 2న (శనివారం)  ఉదయం 11.50 నిమిషాలకు PSLV-C57 రాకెట్‌ ద్వారా ఆదిత్య L1 మిషన్‌ని లాంఛ్  చేయనున్నారు. ఇందులో 7 పేలోడ్స్ ఉంటాయి. ఇవి సూర్యుడిపై వాతావరణ పరిస్థితులను స్టడీ చేస్తాయి. సూర్యుడిపై అధ్యయనానికి మన దేశం పంపిస్తున్న తొలి శాటిలైట్ ఇదే.  లాంచ్ కు సంబంధించిన రిహార్సల్స్  పూర్తైందని, ప్రయోగానికి సిద్ధంగా ఉన్నామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.

Also read : Natural Face Pack : ఈ నాలుగు పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే చాలు.. స్కిన్ మెరిసిపోవాల్సిందే?

ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం ఇస్రో డైరెక్టర్లు అమిత్ కుమార్., డాక్టర్ మోహన్ ఆదిత్య ఎల్ – 1 ఉపగ్రహ నమూనాతో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిత్య ఎల్ – 1 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిత్య ఎల్ 1 సక్సెస్ కావాలని ప్రార్థించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆదిత్య ఎల్-1 నమూనాకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఇస్రో డైరెక్టర్లను ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ‘ఆదిత్య ఎల్ – 1’ ఉపగ్రహం అనేది భూమికి సూర్యుడికి మధ్యనున్న లాంగ్రేజ్ 1 పాయింట్ (ఎల్ – 1) వద్ద చక్కర్లు కొడుతూ సూర్యుడిపై స్టడీ (Aditya L1 Launch) చేస్తుంది. చంద్ర, సూర్య గ్రహణాల సమయంలో కూడా నిరంతరంగా సూర్యుడిపై రీసెర్చ్ ను కొనసాగిస్తుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంగ్రేజ్‌ పాయింట్‌ – 1 ఉంటుంది.  భూమి నుంచి లగ్రాంజ్ పాయింట్ కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది.