Coronavirus: దేశంలో 18 వేలు దాటిన కరోనా కేసులు!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరుగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 30, 2022 / 01:01 PM IST

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరుగుతున్నాయి. క్రితం రోజు 14 వేలుగా ఉన్న కేసులు.. తాజాగా 18 వేలు దాటాయి. దాంతో క్రియాశీల కేసులు లక్షపైకి చేరాయి. బుధవారం 4.52 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,819 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితంరోజు కంటే కొత్త కేసులు 4 వేల మేర అధికంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.16 శాతానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. తాజా ఉద్ధృతితో క్రియాశీల కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య లక్ష దాటి..1,04,555కి చేరింది. యాక్టివ్‌ కేసుల రేటు 0.24 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.55 శాతానికి పడిపోయింది. నిన్న 13,827 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 39 మంది మరణించారు.