Site icon HashtagU Telugu

Corona Virus: ఇండియాలో క‌రోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!

Corona Virus India 5

Corona Virus India 5

భార‌త్‌లో గ‌త 24 గంటల్లోకొత్తగా 1,938 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌ క‌రోనా కార‌ణంగా నిన్న ఒక్క‌రోజు 67 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, అలాగే దేశ వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుండి 2,531 మంది కోలుకున్నార‌ని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుద‌ల చేసింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,30,12,749 కోట్ల‌ క‌రోనా కేసులు న‌మోద‌వ‌గా.. 5,16,672 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,30,14,687‬ కోట్ల మంది క‌రోనా నుంచి కోరుకున్నార‌ని స‌మాచారం. ఇక మ‌రోవైపు దేశంలో ప్ర‌స్తుతం ఇండియ‌లో 22,427 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక‌పోతే దేశం క‌రోనా పాజిటివిటీ రేటు 0.29 శాతం ఉంది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.74 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 1,82,23,30,356కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించింది.