Site icon HashtagU Telugu

Lockdown effect: కోవిడ్ మహమ్మారి ఎఫెక్ట్ …బాలికల్లో ముందస్తు రజస్వల..!!

115033545 Gettyimages 1226314512

115033545 Gettyimages 1226314512

కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడించింది. అది సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. కొందరు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకోందరు ప్రాణాలు విడిచారు. మరికొందరు కోలుకున్నా…మానసిక శారీరక బాధలు పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించి కొట్టుమిట్టాడుతున్నవారు ఉన్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ ఎఫెక్ట్ భాలికలపై కూడా పడింది. కోవిడ్ లాక్ డౌన్ తో ఎక్కువ కాలం ఇళ్లలో ఉన్న బాలికలు, విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పూణె వైద్యులు చేసిన పరిశోధనలు, భయానక నిజాలు వెలిబుచ్చారు. పీడియాట్నిక్ ఎండో క్రైనాలజీ అండ్ మెటబాలిజం జర్నల్ లో పరిశోధన రిపోర్టు ప్రచురించబడింది.

ఈ రిపోర్టు ప్రకారం..లాక్ డౌన్ ప్రభావం బాలికపలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో బాలికలు యుక్తవయస్సు రాకముందే రజస్వల అవుతున్నట్లు తెలిపింది. గతంలో కంటేనూ లాక్ డౌన్ సమయంలోనే రజస్వల అయిన వారి సంఖ్య 3.6రెట్లు పెరిగిందని తెలిపింది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాలని అంటున్నారు. సాధారణంగా బాలికలు 13 నుంచి 15ఏళ్లలోపు రజస్వల అవుతారు. కానీ కోవిడ్ ప్రభావంతో 8 నుంచి 9 ఏళ్లలోనే ఇలా పెరిగిందని పూణె నివేదిక తెలిపింది.

9ఏళ్ల వయస్సులోనే యవ్వనంలోనే రావడాన్ని ప్యూబర్టీగా చెబుతారు. ప్యూబర్టీ కేసులు లాక్ డౌన్లో అధికంగా నమోదు అయినట్లు పూణెలోని జహంగీర్ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. 2018 సెప్టెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 29, 2020 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి పరిశోధనలు నిర్వహించారు. అంటే మార్చి 1, 2020 నుంచి సెప్టెంబర్ 30, 2021 వరకు ఉన్న కేసులను విశ్లేషించి…లాక్ డౌన్ ముందు వచ్చిన మొత్తం 4208 కేసుల్లో కేవలం 59మాత్రమే రైపీసీసీవి ఉండేవని కానీ లాక్ డౌన్ సమయంలో వచ్చిన 3053 కేసుల్లో 155 ఇలాంటివేనని గుర్తించారు.

అయితే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇలా మారేందుకు కారణమవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల కూడా ఇలా జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. లాక్ డౌన్ సమయంలో బాలికలు మానసిక ఒత్తిడులకు లోనయ్యారు. ఇంట్లోనే ఉండటంతో ఈ ప్రభావం ఎక్కువైందని వైద్యులు చెబుతున్నారు. అయితే లాక్ డౌన్ లోనే ఈ కేసులు ఎక్కువగా పెరిగాయని…దీనికి కారణం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పూణె వైద్యులు చెబుతన్నారు.