Site icon HashtagU Telugu

Corona Cases Update: ఇండియాలో క‌రోనా.. లేటెస్ట్ అప్‌డేట్

Corona India

Corona India

ఇంయాలో గ‌త 24 గంట‌ల్లో 14,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని, నిన్న క‌రోనా కార‌ణంగా 302 మంది ప్రాణాలు కోల్పోయార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక క‌రోనా బారిన ప‌డిన వారిలో 30,009 మంది కోలుకున్నార‌ని, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌కు 4,28,81,179 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, క‌రోనా కార‌ణంగా 5,12,924 మంది మ‌ర‌ణించారు.

ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,22,19,896 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం దేశంలో 1,48,359 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.22 శాతంగా ఉండ‌గా, క‌రోనా రికవరీ రేటు 98.46 శాతంగా ఉందని కేంద్ర వైద్యా ఆరోగ్య శాక తెలిపింది. దేశంలో వ్యాక్సినేష‌న్ ముమ్మ‌రంగా సాగుతున్న క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌లో 176.52 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాక వెల్లడించింది.