Site icon HashtagU Telugu

Corona Latest Update: ఇండియాలో మళ్ళీ పెరుతున్న క‌రోనా కేసులు..!

Corona44

Corona44

ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గ‌త 24గంట‌ల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 71,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక క‌రోనా కార‌ణంగా 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రోజు రోజుకీ క‌రోనా మ‌ర‌ణాలు పెరుగుతుండ‌టం ఆందోళ‌ణ క‌ల్గిస్తుంది. ఇక నిన్న‌ 1,72,211 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 8,92,828 మంది క‌రోనా రోగులు వివిద ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 4,24,10,976 మంది క‌రోనా బారిన ప‌డగా, 4,10,12,869‬ మంది కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 5,05,279 మంది మరణించారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది. ఇండియా వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 170,87,06,705 డోసుల వ్యాక్సిన్లు వినియోగించార‌ని స‌మాచారం. ఇకపోతే తెల‌గు రాష్ట్రాలు అయిన ఆంద్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.