ఇండియాలో నిన్న ఒక్కరోజు 22,270 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా నుండి 60,298 మంది కోలుకున్నారని, 325మంది కరోనా కరాణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెల్పింది. ఇక భారత్‌లో ఇప్పటి వరకు 4,28,02,505 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 4,20,37,536 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 5,11,230 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుతం దేశంలో 2,53,739 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇండియాలో కరోనా పాజిటివ్ రేటు 1.8 శాతానికి తగ్గడం విశేషం. అలాగే దేశంలో ఇప్పటి వరకు 175.03 వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెల్పింది.
Corona Update: ఇండియాలో కరోనా.. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు ఎన్నంటే..?

Corona Virus India