Site icon HashtagU Telugu

India Corona Bulletin: ఇండియాలో క‌రోనా.. ఈరోజు మ‌ళ్ళీ పెరిగిన కేసులు..!

Corona India22

Corona India22

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో కొత్తగా 30,615 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క‌రోజే 82,988 మంది క‌రోనా నుండి కోలుకోగా, 514 మంది క‌రోనా సోకి మ‌ర‌ణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెల్పింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 4,27,23,558 మందికి క‌రోనా సోక‌గా, 4,18,43,446 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. అలాగే క‌రోనా కార‌ణంగా 5,09,872 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భార‌త్‌లో ప్ర‌స్తుతం 5,70,240 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక‌పోతే దేశంంలో రోజువారీ క‌రోనా పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉంది.

ఇక తెలంగాణ‌లో నిన్న కొత్త‌గా 569 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 2,098 మంది క‌రోనా నుండి కోలుకోగా, రాష్ట్రంలో ఎలాంటి క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 7,84,631 క‌రోనా పాజిటివ్ కేసులు నమోద‌వ‌గా, 7,72,145 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 8,379 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఏపీలో గ‌డ‌చిన 24 గంట‌ల్లో 615 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 2,787 మంది కరోనా నుంచి కోలుకోగా, క‌రోనా కార‌ణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో వ్యాప్తంగా ఇప్పటివరకు 23,13,827 మంది కరోనా బారినప‌డ్డార‌ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇక 22,86,575 మంది కరోనా నుంచి కోలుకోగా, 12,550 క‌రోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక క‌రోనా కార‌ణంగా ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 14,702 మంది మ‌ర‌ణించారు.