Site icon HashtagU Telugu

Corona at SHAR:షార్ లో క‌రోనా క‌ల‌క‌లం.. 12 మందికి క‌రోనా పాజిటివ్‌

Sriharikota

Sriharikota

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్‌)లో కరోనా కలకలం రేగింది. ఇద్దరు వైద్యులతో సహా 12మందికి క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయింది. గత నెల‌ 27వ తేది నుంచి వరసగా కేసులు నమోదవుతున్నాయి. ఒమైక్రాన్ అయి ఉండొచ్చనే అనుమానంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఒకే రోజు 12 మందికి పాజిటివ్‌గా తేలడంతో షార్‌ యాజమాన్యం ఉలికిపడింది. వీరిలో ఇద్దరు వైద్యులు ఉండటం విశేషం. సూళ్లూరుపేటలోని షార్‌ ఉద్యోగుల కేఆర్పీ, డీఆర్‌డీఎల్‌లలో ఒక్కొక్కరు, సూళ్లూరుపేట శివార్లలో మరో షార్‌ విశ్రాంత ఉద్యోగికి కరోనా సోకడంతో సూళ్లూరుపేటలో కూడా కరోనా విస్తరించే ప్రమాదం ఏర్పడుతోంది. దీంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు