Site icon HashtagU Telugu

Hyderabad:పండుగకు ఊరెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!

stephen ravindra

stephen ravindra

సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. దీంతో హైదరాబాద్ లో ఉండే వాళ్లంతా ఊరిబాట పడుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో ఫ్యామిలీతో సహ ఊళ్లకు పయమనవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని గైడ్ లైన్స్ జారీ చేశారు. పండుగకు ఊరు వెళ్లేవాళ్లంతా జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి. నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్ మెన్ ను నియమించుకోవాలి.కాలనీవాళ్లు కమిటీలు వేసుకొని వాచ్‌మెన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకకోవాలని సూచిస్తున్నారు. కొత్తవాళ్లు కనిపిస్తే.. అనుమానస్పదంగా తిరిగితే 100 డయల్‌ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 94906 17444 కు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సూచించింది.