Site icon HashtagU Telugu

Russia Ukraine war.. సామాన్యుడిపై ర‌ష్యా బాంబ్.. భారీగా పెరిగిన‌ వంట నూనె ధ‌ర‌లు..!

Cooking Oil Prices

Cooking Oil Prices

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉక్రెఇయ‌న్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేప‌ధ్యంలో, ఆ ప్ర‌భావం భారత్ పై పడింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కార‌ణంగా ఇండియాలో వంటనూనెల ధరలు పెరిగాయి. ఎగుమతులపై ఆంక్షలు, సరఫరాలో ఆటంకాలు, ఇలా ప‌లు కార‌ణాల‌తో దేశంలో వంటనూనె ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. గత నెలరోజుల వ్యవధిలో లీటర్ పామాయిల్ 20 రూపాయ‌లు, సన్ ప్లవర్ అయిల్ 24 రూపాయ‌లు, వేరుశెనగ అయిల్ 23 రూపాయ‌లు వరకు పెరిగాయి.

ఇండియాలో వినియోగించే పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల్లో 90శాతం వరకు విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అత్యధికంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న క్ర‌మంలో తాజా యుద్ధం కార‌ణంగా ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయ‌ని వ్యాపారులు అంటున్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా స‌గ‌టు ధ‌ర‌లు గ‌మ‌నిస్తే.. స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్ 152.30 రూపాయ‌లు, పామాయిల్ 135.78 రూపాయ‌లు, వేరుసెన‌గ ఆయిల్ 173.40 రూపాయ‌లుగా ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ట్రేడర్లు ధరలు పెంచేసినట్లు స‌మాచారం. అయితే ట్రేడర్లు కావాల‌నే కృత్రిమ కొరత సృష్టించారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎంత పెరుగుతాయోనని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉక్రెయిన్ ర‌ష్యా వార్, ఇండియాలో సామాన్యుల చావుకువ‌చ్చింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Exit mobile version