Gun Misfire: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో సెక్యూరిటీగా ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన 50 ఏళ్ళ రామయ్య హెడ్ కానిస్టేబుల్ సర్వీస్ రైఫిల్ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన రామయ్యను కేర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కానిస్టేబుల్ మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. రామయ్య స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటగా తెలిపారు.
Read More: Spy Review: నిఖిల్ మరో హిట్ కొట్టాడా.. ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే!